దళితులకు షాపుల్లో క్షవరం చేయట్లేదని ఫిర్యాదు

దళితులకు షాపుల్లో క్షవరం చేయట్లేదని ఫిర్యాదు

జగదేవపూర్(వెలుగు) : దళితులకు షాపుల్లో క్షవరం చేయట్లేదని, చెట్ల కింద అయితేనే చేస్తున్నారని సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ లోని దళితులు తహసీల్దార్​కు బుధవారం ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన ప్రకారం.. కొంతమంది యువకులు హెయిర్ కట్టింగ్ కోసం బుధవారం గ్రామంలోని  సెలూన్​​కు వెళ్లారు. ఓ వ్యక్తి కూర్చీలో కూర్చోగా షాపు నిర్వాహకుడు ‘మీకు  షాప్​లో క్షవరం చేయం. మీ వాడలోని  చెట్టు కిందనే  కట్టింగ్​ చేస్తాం’ అని అతడిని బయటికి పంపించాడు. 

దళితులమైనందునే తమకు షాప్​లో  క్షవరం చేయడం లేదని గ్రామానికి చెందిన 30 మంది దళిత యువకులు కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మరాఠీ కృష్ణ మూర్తితో కలిసి జగదేవ్ పూర్ తహసీల్దార్​ రఘువీరా రెడ్డికి, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  ఈ సందర్భంగా కృష్ణ మూర్తి మాట్లాడుతూ క్షవరం విషయంలో దళితుల పట్ల  వివక్ష చూపిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.