
కోల్ బెల్ట్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ చెన్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అభ్యర్థి బాల్క సుమన్ కు ఆయన పీఏ తోట శ్రీకాంత్ కొమ్ము కాస్తున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ లీడర్లు మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ కు ఫిర్యాదు చేశారు. మంగళవారం కలెక్టర్ ను కలిసిన వారు మాట్లాడుతూ అధికారిక పీఏగా కొనసాగుతున్న శ్రీకాంత్ రాత్రిపూట రాజకీయ నాయకులను ప్రలోభాలకు గురిచేస్తూ బాల్క సుమన్ కు సహకరించాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపించారు.
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తోట శ్రీకాంత్ పై యాక్షన్ తీసుకోవాలన్నారు. లీడర్లు రఘునాథ్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, ఎండీ ముజాహిద్, బింగి శివకిరణ్, సత్యపాల్, ఎర్రబెల్లి రాజేశ్, పోలు నరేశ్, రామగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు.