
కంది, వెలుగు: బీఆర్ఎస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత రఘునందన్‌రావుపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధికారులను కోరారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై రఘునందన్ రావు పరుషపదజాలంతో తిట్టారని తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం ఇచ్చినవారిలో కాసాల బుచ్చిరెడ్డి ఉన్నారు.