బండి సంజయ్‌‌పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు 

బండి సంజయ్‌‌పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు 

కరీంనగర్ సిటీ, వెలుగు: బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై సోమవారం కాంగ్రెస్ నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రచారంలో భాగంగా హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని, కాంగ్రెస్‌‌ పార్టీ రాముడిని అవమానిస్తున్నదంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందజేసిన వారిలో మల్యాల సుజిత్ కుమార్, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రజా సంబంధాల అధికారి దొంతి గోపి ఉన్నారు.