
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సీఐపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసింది బాలల హక్కుల సంఘం. మంగళవారం జరిగిన ఓ ధర్నాలో బెల్లంపల్లి సీఐ రాజు.. ఇద్దరు మైనర్లు సందీప్, అరవింద్ ని కాలితో తన్ని వ్యాన్ ఎక్కించారు. దీంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల దురుసు ప్రవర్తనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న బాలల హక్కుల సంఘం HRCని ఆశ్రయించింది. సీఐపై చట్ట పరమైన చర్యలు తీసుకునే విధంగా ఉన్నతాధికారులకు ఆదేశించాలని కోరారు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అచ్యుత రావు.