వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై హైడ్రాకు ఫిర్యాదు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై హైడ్రాకు ఫిర్యాదు

హైదరాబాద్: వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. హైడ్రా ప్రధాన కార్యాలయం బుద్ధ భవన్‎లో సోమవారం (జనవరి 20) ప్రజావాణి కార్యక్రమం జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఓ మహిళ వైసీపీ నేత, పాణ్యం మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై హైడ్రాకు ఫిర్యాదు చేసింది. 

హైదరాబాద్‎ అమీన్ పూర్‎లోని 193 సర్వే నంబర్‎లో ఉన్న తన భూమిని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి, రమేష్ ఇద్దరు కలిసి కబ్జా చేశారని బాధితురాలు హైడ్రా కమిషనర్‎కు కంప్లైంట్ చేసింది.అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యాలు చేశాడిని.. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు హైడ్రాకు సమర్పించానని ఆమె పేర్కొన్నారు. చెరువు ఔట్ ఫ్లో వెళ్లకుండా మొత్తం మట్టి పోసి ఎత్తు పెంచారని.. దీంతో చెరువు పెద్దగా విస్తరించి.. రైతులు, స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 

చాలా లే ఔట్‎లు, అగ్రి కల్చర్ ల్యాండ్స్ మునిగిపోయాయని.. వీటికి సంబంధించిన అన్ని టెక్నికల్ ఎవిడెన్స్, గూగుల్ పిక్చర్స్, ఎఫ్ఐఆర్ కాపీలు హైడ్రా కమిషనర్‎కు అందజేశానని ఆమె చెప్పారు. హైడ్రా కమిషనర్ కూడా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలపారు. ఇప్పటికే కబ్జాకు గురైన మా లే ఔట్ ప్లాట్లు, రోడ్లు విడుదల అయ్యాయని.. కానీ ఇంకా చాలా ప్లాట్లు నీళ్లలో మునిగే ఉన్నాయని..  నాలాను మూసేసి నీళ్ళు వెళ్లకుండా చేయడమే ఇందుకు ప్రధాన  కారమణమని ఆమె పేర్కొన్నారు.