బీర్కూర్, వెలుగు : బీర్కూర్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్‌లో బీసీ (బిజినెస్ కరస్పాండెంట్)గా పని చేస్తున్న శివరాజ్‌పై పలువురు గ్రామ ప్రజలు గురువారం మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బిజినెస్ కరస్పాండెంట్‌గా పని చేస్తూ ఇంకో వర్కర్ చేత బ్యాంకు లావాదేవీలు చేయిస్తున్నాడని ఆరోపించారు.
బీసీ బ్యాంకుకు వచ్చే కస్టమర్లతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాడని శివరాజ్ పై చర్యలు తీసుకోవాలని బ్యాంకు మేనేజర్ అనిల్‌కు ఫిర్యాదు చేశారు. బ్యాంకు మేనేజర్మాట్లాడుతూ.. విచారణ చేపట్టి అతను తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో వడ్ల బస్వరాజ్ యోగి, సాయిబాబా పింకీ రమేశ్, మెహరాజ్ తదితరులు ఉన్నారు.