వరంగల్  కలెక్టర్ పై జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు

 వరంగల్  జిల్లా కలెక్టర్, వర్ధన్నపేట మున్సిపల్  కమిషనర్ పై ఏఐసీసీ కార్యవర్గ సభ్యుడు బక్క జడ్సన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారిద్దరిపై జాతీయ ఎస్సీ కమిషన్ కు ఆయన ఫిర్యాదు చేశారు. వర్ధన్నపేట పట్టణంలో ఇళ్ల కూల్చివేతతో నష్టపోయిన దళితులకు ఇప్పటివరకు న్యాయం చేయలేదని జడ్సన్  ఆరోపించారు. రోడ్డు విస్తరణలో 25 కుటుంబాలు నష్టపోగా వారికి పునరావాసం కల్పించకుండా పరిహారం ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేశారని ఆయన మండిపడ్డారు. చెన్నారంలో 150 ఎస్సీ కుటుంబాలు, దమ్మన్నపేటలో 250 ఎస్సీ కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరైనప్పటికీ ఇప్పటి దాకా ఇవ్వలేదని విమర్శించారు.

పైగా అభివృద్ధి పనుల పేరుతో వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి ఇప్పటి వరకు ప్రతిష్టించలేదని ఫైరయ్యారు. ఈ అన్యాయాలను ప్రశ్నించిన దళిత సంఘాలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నార ని ధ్వజమెత్తారు. వర్ధన్నపేట పట్టణంలో ఇళ్ల కూల్చివేతలో నష్టపోయిన దళితులు,  చెన్నారం, దమ్మన్నపేటల్లో ఇండ్ల స్థలాలు ఇవ్వనందుకు వరంగల్  కలెక్టర్, మున్సిపల్  కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్యసీ కమిషన్ కు ఫిర్యాదు చేశానని జడ్సన్ తెలిపారు.