రోడ్డు పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తుండు

  • తహసీల్దార్​కు కంప్లైంట్ ఇచ్చినా తుడుందెబ్బ నాయకులు 

తిర్యాణి, వెలుగు: తిర్యాణి మండల కేంద్రంలోని రోడ్ల నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్​ నిర్లక్ష్యం చేస్తున్నారని బుధవారం తుడుం దెబ్బ ఆధ్వర్యంలో తహసీల్దార్​ అనంతరాజుకు ఫిర్యాదు చేశారు.  తుడుం దెబ్బ డివిజన్ ప్రెసిడెంట్ వెడ్మ భగవత్ రావు మాట్లాడుతూ..  నల్ల మట్టి వేసి రోడ్డును అధ్వానంగా మార్చుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి మొరం వేయాలని కోరారు.  మండల అధ్యక్షుడు ఆత్రం గోపాల్,డివిజనల్ వైస్ ప్రెసిడెంట్  గేడం సుభాశ్, ప్రచార కార్యదర్శి  కోట్నాక బారిక్ రావ్, ప్రధాన కార్యదర్శి  తొడసం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.