హైడ్రా మరో కీలక నిర్ణయం.. 2025 జనవరి నుంచి అమలు

 హైడ్రా మరో కీలక నిర్ణయం.. 2025 జనవరి నుంచి అమలు

హైదరాబాద్ లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది.  చెరువులు, కుంటలు, పార్కుల ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు  2025  జనవరి  నుంచి ప్రతి సోమవారం బుద్ధభవన్‌ లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనుంది.  చెరువులు,నాలాలు, పార్కుల ఆక్రమణలపై అర్జీలు ఇవ్వొచ్చని చెప్పింది హైడ్రా. ఇటీవలే చెరువులు,నాలాలు, పార్కులు కబ్జాకు గురవుతున్నట్లు హైదరాబాద్ లో హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే  ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందకు హైడ్రా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

గ్రేటర్ పరిధిలోని చెరువుల పరిరక్షణపై హైడ్రా స్పెషల్ ఫోకస్  పెట్టిన తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీలో వీలైనప్పుడల్లా ఆక్రమణలకు గురైన చెరువులను పరిశీలిస్తున్నారు హైడ్రా కమిషనర్  రంగనాథ్.  ఇటీవలే స్థానికుల ఫిర్యాదుతో   మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తుర్కచెరువును సందర్శించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.

Also Read :- ఎల్బీ నగర్ లో జీహెచ్ఎంసీ ఉద్యోగుల ఆందోళన

 తుర్క చెరువులో ఆక్రమణలతో పాటు కలిషితనీరు కలుస్తుందన్న ఫిర్యాదుతో చెరువును సంబందిత అధికారులతో కలిసి పర్యవేక్షించారు .. అనంతరం బాచుపల్లిలోని ఎర్రకుంట చెరువులో గతంలో అక్రమనిర్మాణాలు కూల్చేసిన సంఘటన  స్థలాన్ని కూడా పరిశీలించారు  రంగనాథ్.  ఎర్రకుంట చెరువును పైలెట్ ప్రాజెక్టుగా అభివృద్ధి పై అధికారులతో చర్చించారు. 

61 శాతం చెరువులు కనుమరుగు

గ్రేటర్​సిటీ పరిధిలోని చెరువులు 61 శాతం కనుమరుగయ్యాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.. మిగిలిన 39 శాతం చెరువులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దేశంలో పట్టణీకరణ కంటే తెలంగాణలో12 శాతం ఎక్కువ‌‌‌‌ ఉందన్నారు.