నగరంలో కుక్కల బెడద రోజురోజుకూ ఎక్కువవుతోంది. దీంతో జీహెచ్ఎంసీ ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. కేవలం36 గంటల్లోనే15 వేల ఫిర్యాదులు వచ్చాయి. ఈ లెక్కన చూసుకుంటే జీహెచ్ఎంసీ గంటకు 416 ఫిర్యాదులు అందుకుంది. అంబర్ పేట్ బాలుడి ఘటన తర్వాత సిటీలో కుక్కల సమస్య మరింత తీవ్రమైంది. ఈ క్రమంలో గడిచిన రెండు, మూడు రోజులుగా తమ ప్రాంతంలో కుక్కల సమస్యపై నగరవాసులు జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేస్తున్నారు.
జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్ల పరిధిలో ప్రతిరోజు 10 ఫిర్యాదులను సిబ్బంది అటెండ్ చేస్తున్నారు. అంటే రోజుకు అధికారులు 300 ఫిర్యాదులు మాత్రమే పరిష్కరిస్తున్నారు. ఐదు ప్రాంతాల్లో ఆపరేషన్లు చేసేందుకు జీహెచ్ఎంసీ షెల్టర్ హోమ్స్ ఉన్నా.. డైలీ 150 ఆపరేషన్లు మాత్రమే చేస్తుండడంతో సిటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.