భారీ వర్షం.. జీహెచ్ఎంసీకీ ఫిర్యాదుల వెల్లువ

భారీ వర్షం.. జీహెచ్ఎంసీకీ  ఫిర్యాదుల వెల్లువ

హైదరాబాద్లో  ఇవాళ ఉదయం కురిసిన వర్షంతో జీహెచ్ఎంసీకి పెద్ద ఎత్తును ఫిర్యాదులు వచ్చాయి.  మొత్తం డీఆర్ఎఫ్ కు 60 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు.  నీళ్లు నిలిచిపోయినట్లు 15, చెట్లు విరిగి రోడ్ల మీద పడినట్లు  25 ఫిర్యాదులు వచ్చాయని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.  నాలాలో    19 బైక్ లు  కొట్టుకుపోగా.. ఒక డెడ్ బాడీని గుర్తించినట్లు చెప్పారు. 

 ఇవాళ ఉదయం భారీ వర్షాలకు  హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు  అతలాకుతలం  అయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.  రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. జనం ఇంకా  తీవ్ర అవస్థలు పడ్డారు. పలు వాహనాలు నాలల్లో కొట్టుకుపోయాయి. సికింద్రాబాద్ లో ఓ చిన్నారి నాళాలో పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.