
ఉగ్రవాదం లేకుండా చేయడమే లక్ష్యమని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదుల అణచివేతకు సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు. పహల్గా ఉగ్రదాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల క్రమంలో ప్రధాని మోదీ బలమైన సందేశాన్ని పంపారు. మంగళవారం (ఏప్రిల్ 29) సాయంత్రం త్రివిద దళాల అధిపతులు, భద్రతా సలహాదారుతో జరిగిన సమావేశంలో ఈ ప్రకటన చేశారు.
మంగళవారం ప్రధాని మోదీ నివాసంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎన్ ఎస్ ఏ అజిత్ దోవల్ , సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ , ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, ఐఏఎష్ చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగులతోసమావేశమయ్యారు.
►ALSO READ | జిప్లైన్ ఆపరేటర్కు ఎన్ఐఏ సమన్లు!
పహల్గాం ఉగ్రదాడికి భారత్ స్పందించే విధానం, లక్ష్యాలు, సమయాన్ని నిర్ణయించేందుకు ఆర్మీకి పూర్తి స్వే్చ్ఛ ఉందని ప్రధాని మోదీ అన్నారు. భారత్ సైన్యంపై సామర్థ్యంపై ప్రధాని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు అన్ని రకాల స్వేచ్ఛ సాయుధ దళాలకు ఇస్తున్నట్ల తెలిపారు. సైన్యమే స్థలం, సమయం చూసి తగిన సమాధానం చెప్తుందన్నారు. ప్రధాని ప్రకటనతో త్వరలో భారత్ పాక్ తో యుద్ధానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.