
టీఎస్పీఎస్సీ నిర్వహించే పలు పోటీ పరీక్షల్లో తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం కీలక అంశం. గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో ఈ విభాగం 11వ అంశంగా ఉంది. గ్రూప్– 2, 3, 4తోపాటు డీఎల్, జేఎల్, ఎస్ఐ, కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షల్లో తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తున్నాయి. దేవపూజ పబ్లికేషన్స్ తీసుకువచ్చిన తెలంగాణ సంపూర్ణ చరిత్ర పుస్తకంలో తెలంగాణ సమాజం సంస్కృతి గురించి సమగ్రంగా ఇచ్చారు. గిరిజనులు, పండుగలు, జాతరలు, కుల పురాణాలను లోతుగా చర్చించారు.
తెలంగాణ ప్రజల వేషధారణ పద్ధతులు, సంప్రదాయాలు, వారసత్వ సంపద, కళలు, సాహిత్యంతోపాటు తెలంగాణ మాండలికాలు, పలుకుబడులు గురించి సమగ్రంగా ఉంది. శాతవాహనుల నుంచి అసఫ్‌జాహీల పాలన వరకు జేఎన్ చౌదరి పాలన నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు చరిత్రను క్లుప్తంగా, సూటిగా వివరించారు. పూర్తి వివరాలకు దేవపూజ పబ్లికేషన్స్, అశోక్‌నగర్, హైదరాబాద్‌ను 9032484325లో సంప్రదించగలరు.