- స్టూడెంట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలి: మంత్రి దామోదర
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 15 మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న నర్సింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. నర్సింగ్ కాలేజీల్లో తరగతుల ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లపై హైదరాబాద్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. జనగామ, భూపాలపల్లి, కరీంనగర్, కొడంగల్, ఆందోల్, ఆసిఫాబాద్, మెదక్, కుత్బుల్లాపూర్, ములుగు, నారాయణపేట, నిర్మల్, రామగుండం, మహేశ్వరం, నర్సంపేట, యాదాద్రిలో ఏర్పాటు చేసిన నర్సింగ్ కళాశాల్లో అడ్మిషన్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు.