
గద్వాల టౌన్, వెలుగు : గద్వాల జిల్లా కేంద్రంలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ గురువారం ముగిసింది. మొత్తం 10 టీమ్స్ పోటీ పడగా మహబూబ్‌నగర్ జట్టు విజేతగా నిలిచింది. రంగారెడ్డి, హైదరాబాద్ జట్లు సెకండ్ ప్లేస్, నల్గొండ థర్డ్ ప్లేస్‌లో నిలిచాయి. విజేతలకు డీఈవో రవీందర్ మెమొంటోలు అందజేశారు. ఆటల్లో తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో బీఎస్.ఆనంద్, రామకృష్ణారావు, బీసన్న, శ్రీనివాసులు పాల్గొన్నారు.