నిజామాబాద్, వెలుగు: జిల్లాలో కేవలం 615 స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ ట్రాన్స్ఫర్ల చేశారని, ఇంకా సుమారు 1500 ఎస్జీటీ, భాషపండితులు, పీఈటీ స్పౌజ్ బదిలీలు పూర్తిచేయాలని కోరుతూ పలువురు టీచర్లు ఎమ్మెల్సీ కవితను కలిశారు.
ఈ మేరకు శుక్రవారం ఆమెను క్యాంపు ఆఫీస్లో కలిసి వినతి పత్రం ఇచ్చారు. ట్రాన్స్ఫర్లు ఆపేయడంతో కిలోమీటర్ల కొద్ది ప్రయాణించాల్సి వస్తుందన్నారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కవిత హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్పౌజ్ ఫోరం సభ్యులు సుధాకర్, రాజేశ్వరి, మనోజ, వందన పాల్గొన్నారు.