అరవై రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి : సీపీ అనురాధ

అరవై రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి : సీపీ అనురాధ
  • సిద్దిపేట సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని, గంజాయి ఇతర మత్తు పదార్థాల రవాణాపై ఉక్కు పాదం మోపాలని సీపీ అనురాధ సూచించారు. శనివారం సీపీ ఆఫీస్ లో సిద్దిపేట డివిజన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీసీటీఎన్ఎస్  వెర్షన్ 2 టెక్నాలజీ గురించి పోలీస్ అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు.

 రాబోయే రోజుల్లో దీని డాటా ప్రకారమే బెస్ట్ పోలీస్ స్టేషన్ల ఎంపిక ఉంటుందన్నారు. ప్రతి నెల చివరి రోజున  సివిల్ రైట్స్ డే నిర్వహించాలని సూచించారు.  కమిషనరేట్ పరిధిలో ఈ నెల 28 నుంచి మే 13 వరకు సిటీ  పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.