కృష్ణకాంత్ పార్క్ లో.. పనులను  త్వరగా పూర్తి చేయండి : రోనాల్డ్ రోస్

హైదరాబాద్, వెలుగు: మంజూరైన పనులను వెంటనే పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తో కలిసి యూసఫ్ గూడలోని కృష్ణకాంత్ పార్క్, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ స్థలం, ఎస్సీఆర్ ప్లే గ్రౌండ్లను   పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కృష్ణకాంత్ పార్క్ లో వాకింగ్ ట్రాక్, వాష్ రూమ్, టాయిలెట్, సీవరేజ్ డ్రైన్ బాక్స్ నిర్మాణం,  క్యాంటీన్ మరమ్మతులు పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ALSO READ:రాముడి గుడి ప్రారంభం తర్వాత.. గోధ్రా తరహా ఘటన జరగొచ్చు

వెంగళరావు నగర్ లో చేపట్టబోయే మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి స్థల పరిశీలన పూర్తయిందని, రహమత్ నగర్ లో ఎస్సీఆర్  ప్లే గ్రౌండ్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట అడిషనల్ కమిషనర్ వి.కృష్ణ, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు..