స్కానింగ్​ సెంటర్లపై కఠిన చర్యలు: డీఎంహెచ్​వో సుదర్శనం

నిజామాబాద్, వెలుగు: లింగనిర్ధారణ చేసే స్కానింగ్​ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్​వో సుదర్శనం పేర్కొన్నారు. భ్రూణ హత్యలను పూర్తిస్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం ఆయన జిల్లా స్థాయి సలహా సంఘం సమావేశంలో మాట్లాడారు.

 గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులుగా పేర్లు నమోదు చేసుకున్న నాటి నుంచి డెలివరీ అయ్యే వరకు ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఫాలోఅప్​చేయాలని సూచించారు. స్కానింగ్​తర్వాత అబార్షన్లు జరిగినట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. ప్రోగ్రామ్​ ఆఫీసర్ ​డాక్టర్ ​రాజేశ్, జిల్లా సంక్షేమ ఆఫీసర్ ​రసూల్​బీ, రేడియాలజిస్ట్​ డాక్టర్​మధుసూదన్ పాల్గొన్నారు.