రేపటి( నవంబర్6)నుంచి సమగ్ర కులగణన సర్వే..జగిత్యాలలో మెటీరియల్ పంపిణీ

రేపటి( నవంబర్6)నుంచి సమగ్ర కులగణన సర్వే..జగిత్యాలలో మెటీరియల్ పంపిణీ

జగిత్యాల:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వే రేపటి(నవంబర్6) నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సమగ్ర కులగణన సర్వే కు కావాల్సిన మెటీరియల్స్ ను పంపిణీ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో  సిబ్బందికి సమగ్ర కులగణనే సర్వేకు సంబంధించిన మెటీరియల్ ను అందజేశారు. 

 
మరోవైపు కరీంనగర్ జిల్లాలో కూడా సమగ్ర కుటుంబ సర్వే కు సంబంధించిన మెటీరియల్ ను అందజేశారు.హుజూరాబాద్ మున్సిపాలిటీ ఆఫీసులో ఎన్యుమరేటర్లకు సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన మెటీరియల్ ను మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య అందజేశారు. 

Also Read : తెలంగాణలో కులగణన చారిత్రకం

రేపటినుంచి మూడువారాల పాటు సమగ్ర కులగణన సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం 50వేలమందికి పైగా సిబ్బంది పనిచేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఉపాధ్యాయులు ఒంటి పూట బడిలో మరో పూట సర్వే నిర్వహించాల్సి ఉంది. 

ప్రతి 150 ఇళ్లకు ఒక ఎమ్యునరేటర్ ను నియమించారు. ప్రత్యేకంగా సర్వే కిట్లు ఉన్నాయి. 56 ప్రధాన, 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలతో సమగ్ర సమాచారాన్ని తీసుకుంటారు. 

పార్ట్‌-1, పార్ట్‌-2 కింద ఎనిమిది పేజీల్లో ఈ సమాచారాన్ని పూరిస్తారు. మొదటి భాగం (పార్ట్‌-1)లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు తెలపాల్సి ఉంటుంది. పార్ట్‌-1లో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. రెండో భాగంలో ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి.