గ్రేటర్‎ హైదరాబాద్‎లో రెండో రోజు కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే

గ్రేటర్‎ హైదరాబాద్‎లో రెండో రోజు కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే గ్రేటర్ హైదరాబాద్‎లో రెండో రోజు (నవంబర్ 7) కొనసాగుతోంది. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి  స్టిక్కరింగ్ వేస్తు్న్నారు. తమకు కేటాయించిన ఇండ్లకు బుధవారమే 60 శాతం వరకు స్టిక్కరింగ్ వేసిన ఎన్యుమరేటర్లు.. మిగిలిన ఇండ్లకు ఇవాళ (నవంబర్ 7), రేపు (నవంబర్ 8) స్టిక్కరింగ్ వేయనున్నారు. మొత్తం మూడు రోజుల్లో స్టిక్కరింగ్ ప్రాసెస్ పూర్తి చేయనున్నారు. 

ప్రభుత్వం ఒక్కో ఎన్యుమరేటర్‎కు 150 నుంచి 175 ఇండ్లు కేటాయించింది. ప్రతీ పది మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్ వైజర్ నియమించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 27 లక్షల 76 వేల ఇండ్లలో సర్వే చేయనున్నారు. కంటోన్మెంట్‎లో ఉన్న మరో 50 వేల గృహాలతో కలిపి మొత్తం 28 లక్షల 28 వేల ఇండ్లలో సర్వే జరగనుంది. సర్వేలో 19 వేల 328 మంది ఎన్యుమరేటర్లు పాల్గొననున్నారు. సర్వే వివరాలను ఏ రోజుకు ఆ రోజు అధికారులు ఆన్లైన్లో ఎంటర్ చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ సర్వే జరగనుంది.