హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 63 శాతం సర్వే పూర్తి అయిందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ వెల్లడించారు. 2024, నవంబర్ 22న కాచిగూడ మోతి నగర్ మార్కెట్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్‌తో కలిసి ఆమె పరిశీలించారు. సర్వే చేస్తోన్న ఎన్యుమరేటర్లతో కలిసి స్థానికుల వివరాలను నమోదు చేయించారు. ఈ సందర్భంగా సర్వేపై ప్రజలకు ఉన్న అనుమానాలను మేయర్ నివృత్తి చేశారు.
ALSO READ : నిజమైన కులగణన చేసి మాలలకు మాదిగలకు న్యాయం చేయాలి: గుమ్మడి కుమారస్వామి
ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ఈ నెల (డిసెంబర్) చివరి వరకు పూర్తి స్థాయిలో సర్వే పూర్తి చేస్తామని.. అవసరమయితే మరికొన్ని రోజులు గడువు పొడిగిస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు సర్వే జరగకుండా అడ్డుకునేందుకు ఎన్యుమరేటర్లను ఇబ్బంది పెడుతున్నారని.. అలాంటి వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. అవసరమైతే తమ కార్యకర్తలు ఎన్యుమరేటర్లకు అండగా సర్వేలో పాల్గొంటారని అన్నారు. సర్వేపై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను పట్టించుకోకుండా సర్వేలో పాల్గొని వారి వివరాలను నమోదు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.