- వ్యాప్తంగా ప్రారంభమైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే
- పరిశీలించిన కలెక్టర్లు, అధికారులు
- ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపు
జనగామ అర్బన్/ మహబూబాబాద్/ తొర్రూరు/ మంగపేట/ పర్వతగిరి/ ఎల్కతుర్తి/ వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బుధవారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలను అడిగి తెలుసుకుని, సమాచారాన్ని ప్రొఫార్మాలో నమోదు చేస్తున్నారు. అనంతరం స్టిక్కర్లను ఇంటికి అతికిస్తున్నారు. అధికారుల సర్వే తీరును జిల్లా కలెక్టర్లు, అధికారులు పరిశీలించారు. సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.జనగామ మున్సిపాలిటీ పరిధిలోని వీవర్స్కాలనీ, గిర్నిగడ్డ, కుర్మవాడలో సర్వే తీరును కలెక్టర్ రిజ్వాన్బాషాషేక్స్పెషల్డిప్యూటీ కలెక్టర్సుహాసిని, మున్సిపల్కమిషనర్వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు.
మహబూబాబాద్ పట్టణంలోని సోమ్లాతండా, 26 వార్డు ఆదర్శనగర్, జమండ్లపల్లి అంబేద్కర్ నగర్, మహబూబాబాద్ మండలం పర్వతగిరి, కంబాలపల్లి గ్రామాల్లో సర్వేను కలెక్టర్అద్వైత్కుమార్సింగ్మున్సిపల్కమిషనర్రవీందర్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. తొర్రూరు మండలంలోని ఆయా గ్రామాల్లో ఎంపీడీవో నర్సింహారావు, ఎంపీవో పూర్ణచందర్, మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో సర్వే తీరును కమిషనర్శాంతికుమార్పరిశీలించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్వేను కలెక్టర్ సత్య శారద పరిశీలించారు.
ఎల్కతుర్తి మండల కేంద్రంలో ప్రారంభమైన సర్వేను హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. వరంగల్సిటీలోని పలు డివిజన్లలో నిర్వహిస్తున్న సర్వేను బల్దియా మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, 27వ డివిజన్లో కార్పొరేటర్ అనీల్ కుమార్తో కలిసి కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు ఆయూత్ ప్రారంభించారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని చుంచుపల్లి, బోర్నర్సాపురం గ్రామాల్లో కొనసాగుతున్న సర్వేలో హౌస్స్టిక్కరింగ్ప్రక్రియను అడిషనల్కలెక్టర్సంపత్రావు పరిశీలించి, సూచనలు చేశారు.
పక్కాగా నమోదు చేయాలి..
అధికారులు ఇంటింటికీ వెళ్లి సభ్యుల వివరాలు పక్కాగా నమోదు చేసి, గోడపైన ఖచ్చితంగా స్టిక్కర్ అంటించాలని పర్యవేక్షణలో అధికారులు ఎన్యూమరేటర్లకు సూచించారు. కుటుంబ యజమాని నుంచి సేకరించే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని వారికి అర్థమయ్యేలా వివరించాలన్నారు.