సమగ్ర ఇంటింటి సర్వే 92.6 శాతం పూర్తి

సమగ్ర ఇంటింటి సర్వే 92.6 శాతం పూర్తి

హైదరాబాద్, వెలుగు: సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే  సోమవారం నాటికి 1,08,89,758  ఇండ్లలో అంటే  92.6 శాతం పూర్తి చేసుకున్నది. 13 జిల్లాల్లో వంద శాతం సర్వే పూర్తి కాగా.. సంగారెడ్డి 88.1 శాతం, మేడ్చల్​ మల్కాజ్​జిగిరిలో 82.3 శాతం, మిగతా 17 జిల్లాలలో 90 శాతానికి  పైగ సర్వే పూర్తయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 25,05,517 ఇండ్లకు గాను ఇప్పటి వరకు 19,04,977 ఇండ్లు అంటే   76 శాతం పూర్తయింది.

 సర్వే  పూర్తి అయిన జిల్లాలో  డేటా నమోదు ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 12,85,871 ఇండ్లకు సంబంధించి కంప్యూటరీకరణ పూర్తి చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎన్యుమరేటర్ కలిసి సర్వే వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా  జాగ్రత్తగా నమోదు చేయాలని జిల్లా ఇన్ చార్జ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.  సర్వే పత్రాలను  భద్రంగా ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.