రైతుల పక్షాన నిలవడ్డనని భార్య జాబ్​ తీసేసిన్రు

సొసైటీ ఆఫీస్​ ముందు కుటుంబంతో ఆందోళన

జగిత్యాల, వెలుగు:  రైతులకు న్యాయం చేయడానికి వారి పక్షాన నిలబడినందుకు తన భార్య జాబ్​ తీసేశారంటూ కుటుంబంతో సహా పీఏసీఎస్​ ఆఫీస్​ ముందు ఆందోళనకు దిగిన ఘటన జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లెడకు చెందిన  వికలాంగురాలైన సుమలత  ఏడేళ్లుగా పీఏసీఎస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తోంది. సుమలత  భర్త  తిరుపతిరెడ్డి వ్యవసాయం చేస్తూ రైతుల పక్షాన పోరాటం చేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా రైతుల పక్షాన నిలబడ్డారు. అనంతరం మక్కల కొనుగోలు విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. రైతుల పక్షాన పోరాడుతున్న తిరుపతిని ఏం చేయలేక అతని భార్య సుమలతను అవుట్ సోర్సింగ్ నుంచి తొలగించారు. దీనికి నిరసనగా పీఏసీఎస్ ఆఫీస్ ముందు కుటుంబ సభ్యులతో తిరుపతిరెడ్డి మంగళవారం ఆందోళన చేశారు. సమస్యలపై పోరాటం చేసిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే బహుమానం ఇదేనా అని ప్రశ్నించారు. సుమలతను డ్యూటీలోకి తీసుకుని న్యాయం చేయాలని కోరారు. డ్యూటీలోకి తీసుకోకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వికలాంగురాలని కూడా చూడకుండా జాబ్​నుంచి తీసేయడాన్ని వికలాంగుల గ్రాడ్యుయేట్ల సంఘం అధ్యక్షుడు అజీజ్ వ్యతిరేకించారు.

For More News..

కరోనా కంట్రోల్‌లో మోడెర్నా, ఫైజర్‌ వ్యాక్సిన్లు 90% సేఫ్‌‌

మొదలైన వింటర్ క్రైసిస్.. పెరుగుతున్న కరోనా కేసులు

జీహెచ్ఎంసీలో టికెట్ల లొల్లి షురూ