ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 63 అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రైతుల్లో ఆందోళన

  •  భారీగా భూములు కోల్పోతున్నామని సర్వేను అడ్డుకుంటున్న వైనం 
  • అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ మార్చాలని రైతుల డిమాండ్​ 
  • లేకపోతే మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాల్యూ ప్రకారం పరిహారం చెల్లించాలె
  • వివాదంగా మారుతున్న భూసేకరణ 

జగిత్యాల/ మెట్ పల్లి, వెలుగు: ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–జగిత్యాల–-- మంచిర్యాల నేషనల్ హైవే 63 విస్తరణ అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై జిల్లా రైతుల్లో ఆందోళన నెలకొంది. తాము భారీగా భూములు కోల్పోతున్నామని సర్వే కోసం ఆఫీసర్లను రైతులు అడ్డుకుంటున్నారు. అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చాలని లేదా మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాల్యూ ప్రకారం పరిహారం ఇస్తేనే తమ భూములు ఇస్తామని రైతులు అల్టిమేటం జారీ చేస్తున్నారు. దీంతో హైవే విస్తరణకు భూసేకరణ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. 

సర్వేను అడ్డుకుంటున్న రైతులు 

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​ నుంచి జగిత్యాల జిల్లా మీదుగా చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జగ్దల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవే 63 నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. 2017 లో దీన్ని గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫీల్డ్​ హైవేగా నిర్మించాలని ప్రతిపాదించి, ఆ తర్వాత పక్కన పెట్టారు. 2023లో హైవే నిర్మాణంలో మార్పులు చేసి రూ.2,581 కోట్ల అంచనాతో పనులను ప్రారంభించారు. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా పెర్కిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుంచి మంచిర్యాల వరకు 131 కిలోమీటర్ల దూరాన్ని ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాలో 69  కి.మీ  పొడవున ఫోర్ లైన్ నిర్మించనున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో మోర్తాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కమ్మరిపల్లి నుంచి జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, రాయపట్నం బ్రిడ్జి మీదుగా  ప్రస్తుతం భూసేకరణకు అధికారులు కొన్ని నెలల కింద నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేశారు. కాగా ఆఫీసర్లు భూసేకరణకు సర్వే చేపడుతుండగా తమ భూములిచ్చేది లేదని రైతులు అడ్డుకుంటున్నారు. అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ మార్చాలని లేదా ఓపెన్​ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాల్యూ ప్రకారం పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. దీంతో సేకరణ సర్వే కోసం ఆఫీసర్లను ఎక్కడిక్కడ అడ్డుకుంటుండగా, రైతులకు సర్ధిచెప్పలేక ఆఫీసర్లు తలలుపట్టుకుంటున్నారు. 

ప్రస్తుత అలైన్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వ్యతిరేకిస్తున్నరు 

ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 63 నిర్మాణానికి మూడేళ్ల కింద తయారు చేసిన అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాకుండా కొత్తగా మరోదానిని తెరపైకి తెచ్చారని, దీనివల్ల తాము భారీగా భూములు కోల్పోతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల తమ విలువైన భూములు కోల్పోతున్నామని జగిత్యాల, మెట్ పల్లి, కోరుట్ల డివిజన్ల పరిధిలోని పలు గ్రామాల రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. గతంలో ఎస్సారెస్పీ, కాకతీయ కెనాల్, వరద కాలువ, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-– కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైల్వే  లైన్​ కోసం తమ భూములు ఇచ్చామని, ప్రస్తుతం మరోసారి ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 63కి ఇవ్వలేమని తేల్చిచెబుతున్నారు. భూములు కోల్పోకుండా రోడ్డు అలైన్మెంట్ మార్చాలని 
డిమాండ్​ చేస్తున్నారు. 

మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రేటియ్యాలె

బైపాస్ పేరిట 2 పంటలు పండే వ్యవసాయ భూములను గుంజుకోవడం సరికాదు. రైతులకు నష్టం జరగకుండా అలైన్మెంట్ మార్చాలి. లేకపోతే ఓపెన్ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం పరిహారం ఇయ్యాలె. పరిహారం ప్రకటించాకే సర్వే చేయాలి. నాకు ఈ భూమి తప్ప వేరే ఆధారం లేదు. 
- రైతు రాజయ్య, వెల్లుల్ల, మెట్ పల్లి