షర్మిల అరెస్టు.. పాదయాత్ర రద్దు

షర్మిల అరెస్టు.. పాదయాత్ర రద్దు

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబాబాద్‭లో పాదయాత్ర చేయకుండా ఆమెకు ముందుగానే నోటీసులు ఇచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. షర్మిల పాదయాత్రను ఎలాగైనా అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే శంకర్ నాయక్‭కు షర్మిల క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ఎస్పీ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఎలాగైనా పాద్రయాత్ర చేసేందుకు మహబూబాబాద్ వెళ్లిన షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు.