
వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళనకు దిగారు. పీహెచ్డీ సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని నిరసనకు వ్యక్తం చేసిన ఆశావహులు.. వీసీ చాంబర్లో బైఠాయించి పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేశారు. పీహెచ్డీ సీట్ల కేటాయింపులో గత నాలుగు నెలలుగా వీసీ కాలయాపన చేస్తున్నారని.. వీసీ తీరుతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్డీ సీట్లను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. పీహెచ్డీ అభ్యర్థుల ఆందోళనతో వీసీ చాంబర్ వద్ద ఉద్రిక్తత నెలకొనగా.. రంగంలోకి దిగిన పోలీసులు అభ్యర్థుల దగ్గరున్న పెట్రోల్ బాటిల్ లాక్కొని.. ఆందోళన చేస్తోన్న వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.