హైదరాబాద్ లోని విరించి హాస్పిటల్ దగ్గర ఆందోళనకు దిగారు పేషెంట్ బంధువులు. జ్వరంతో హాస్పిటల్ వెళ్తే.. రాంగ్ ట్రీట్ మెంట్ ఇచ్చి తన అన్నను చంపారని ఆరోపించింది మృతుడి సోదరి. అనవసరంగా స్టెరాయిడ్స్ ఇవ్వడంతో తన అన్న లంగ్స్, కిడ్నీలు పాడై చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. ట్రీట్ మెంట్ ఇచ్చిన డాక్టర్ రావాలని డిమాండ్ చేసింది ఆమె. ఏ తప్పు చేయకపోతే డబ్బులు కట్టకుండా డెడ్ బాడీని ఎందుకు తీసుకెళ్లుమన్నారని ప్రశ్నించింది. డబ్బులు కూడా ఎందుకు వాపస్ ఇచ్చారని నిలదీసింది. తన అన్న చనిపోలేదని.. చంపేశారని ఆరోపించింది. డాక్టర్లు సరైన కారణం చెప్పకపోవడంతో.. హాస్పిటల్ సిబ్బందికి.. మృతుడి బంధువులకు తోపులాట జరిగింది. ఆగ్రహంతో హాస్పిటల్ పై దాడి చేశారు మృతుడి బంధువులు. హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకు ఫోన్ చేయడంతో వాళ్లు వచ్చి.. మృతుడి సోదరి, బంధువులను బయటికి పంపించారు.