టీఎస్‌పీఎస్సీ ఎదుట పీఈటీ అభ్యర్థుల ఆందోళన

బషీర్​బాగ్,  వెలుగు : గురుకుల పీఈటీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని 2017లో వెలువడిన నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ ఎదుట ఆందోళనకు దిగారు. ఆరేండ్లుగా  పీఈటీ పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. అంతకుముందు వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ  పబ్లిక్ గార్డెన్ నుంచి టీఎస్‌పీఎస్సీ వరకు ర్యాలీ నిర్వహించారు. 2017లో ప్రభుత్వం 616  పీఈటీ  పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చిందని అభ్యర్థులు తెలిపారు.

ALSOREAD:మోడీ చేతుల్లో దేశం సురక్షితం..కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే

1,232 మందిని ఎంపిక చేసిందని చెప్పారు. కోర్టు కేసుల కారణంగా ఆరేండ్లుగా కాలయాపన చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కోర్టు కేసు పూర్తి అయ్యిందని.. అయినా టీఎస్‌పీఎస్సీ ఇంకా స్పందించటం లేదని అభ్యర్థులు వాపోయారు. వెంటనే 616 పోస్టు లను భర్తీ చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేడతామని అభ్యర్థులు శ్రీనివాస్ , మహేశ్, రాజు , కవిత  హెచ్చరించారు.