
సదాశివపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని గవర్నమెంట్డిగ్రీ కాలేజీలో మంగళవారం డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తుండగా గంట ముందే ఆన్సర్ షీట్లను తీసుకున్నారని స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. ఎగ్జామ్ పేపర్లో 3గంటల సమయం ఉందని రెండు గంటలకే ఎలా తీసుకుంటారని ఇన్విజిలేటర్తో వాగ్వాదానికి దిగారు.
ప్రిన్సిపల్ పతంజలి వివరణ కోరగా.. సెమిస్టర్ ఎగ్జామ్కు యూనివర్సిటీ ఆఫీసర్లు రెండు గంటలు మాత్రమే ఇచ్చారని, క్వశ్చన్ పేపర్లో మాత్రం 3గంటల సమయం ఇచ్చినట్లు ప్రింట్ అయ్యిందన్నారు. అయినప్పటికీ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్కు 3గంటల సమయం ఇచ్చామని తెలిపారు.