ములకలపల్లి, వెలుగు : మండలంలోని మూకమామిడి పంచాయతీ సాయిరాంపురం లో వారం రోజులుగా తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోరు మోటర్ రిపేరు చేయించడం లేదు. ఈ విషయమై బుధవారం గిరిజనలు ఖాళీ బిందెలతో బోరు మోటార్ వద్ద ఆందోళన నిర్వహించారు.
తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బోరు రిపేరు చేయించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.