చైనా నుంచి జపాన్ కు వ్యాపించిన వైరస్.. 20 ఏళ్ల నాటి HMPV వైరస్.. ఇప్పుడు కట్టలు తెంచుకుంది...!

చైనా నుంచి జపాన్ కు వ్యాపించిన వైరస్.. 20 ఏళ్ల నాటి HMPV వైరస్.. ఇప్పుడు కట్టలు తెంచుకుంది...!

కొత్త వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ వైరస్ పేరు హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్.. ముద్దుగా HMPV వైరస్ అంటున్నారు. ఇప్పుడు ఈ వైరస్ చైనా దేశాన్ని వణికిస్తుంది. లక్షల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ప్రధాన లక్షణం.. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది ఈ వైరస్. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా చైనాలో.. అంటు వ్యాధిగా ఈ వైరస్ వ్యాపిస్తుంది. చిన్న పిల్లలు, వృద్ధుల్లో వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తుంటే.. యుక్త వయస్సు వారిలో.. వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండే వాళ్లు మాత్రం తట్టుకోగలుగుతున్నారంట. 

ఇప్పటికే చైనాలోని ఉత్తర ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ వైరస్ కట్టడి కోసం చైనా ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తుంది. HMPV వైరస్ అనేది కొత్తది కాదని.. 20 ఏళ్ల క్రితమే ఈ వైరస్ గుర్తించినట్లు డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ వైరస్ కట్టలు తెంచుకుని వ్యాపిస్తు్న్నట్లు చైనా నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ 20 ఏళ్లల్లో ఈ వైరస్ కు వ్యాక్సిన్, మందు కొనుగొనలేదు. ఈ 20 ఏళ్లలో ఈ వైరస్ మరింత శక్తివంతంగా మారినట్లు కూడా కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. 

Also Read :- చైనాలో కొత్త వైరస్.. కరోనా తరహాలో వ్యాప్తి

HMPV వైరస్ చైనా నుంచి ఇప్పుడు జపాన్ దేశానికి విస్తరించింది. జపాన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం.. జపాన్ దేశ వ్యాప్తంగా 7 లక్షల 18 వేల కేసులు నమోదయ్యాయని.. 2024 డిసెంబర్ నెలలోనే 94 వేల 259 కొత్త కేసులు వచ్చినట్లు స్పష్టం చేసింది. జపాన్ దేశ వ్యాప్తంగా 5 వేల ఆస్పత్రులు, క్లినిక్స్ లో HMPV వైరస్ బాధితులకు చికిత్స జరుగుతున్నట్లు వెల్లడించింది జపాన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్. వైరస్ బాధితుల్లో అన్ని వయస్సుల వారు ఉన్నారని.. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉన్నట్లు వివరించింది. 

ఈ వైరస్ కేసులు హాంకాంగ్ లోనూ నమోదయ్యాయి. కాకపోతే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. హాంకాంగ్ వైద్య శాఖ వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నది. 

చైనా నుంచి వ్యాపిస్తున్న HMPV వైరస్.. ఇప్పుడు ఆసియా దేశాలకు విస్తరించింది. చైనా, హాంకాంగ్, జపాన్ వరకు వచ్చిన ఈ వైరస్.. ఇప్పుడు ఇండియాకు రావటానికి పెద్ద సమయం ఉండకపోవచ్చు. సో.. బీ కేర్ ఫుల్.. అప్రమత్తంగా ఉండండి.. కరోనా కాలం చూశాం కదా.. సరిగ్గా ఐదేళ్ల తర్వాత మన చైనా నుంచి వ్యాపిస్తున్న మరో వైరస్ ఇది. బీ అలర్ట్.. బీ కేర్ ఫుల్..