
వికారాబాద్, వెలుగు: గవర్నమెంట్ స్కూల్లో పెచ్చులు ఊడిపడి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కు గాయాలయ్యాయి. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలోని మున్నూర్సోమారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శీరిష ఫస్ట్ క్లాస్చదువుతోంది. బుధవారం ఎప్పటిలాగే స్కూల్కు వెళ్లగా, ఉదయం తరగతి గదిలో ఆమెపై ఆకస్మాత్తుగా పెచ్చులు ఊడిపడ్డాయి.
ఈ సమయంలో క్లాస్లో 14 మంది విద్యార్థులు ఉండగా, శిరీష తల, కాలికి గాయాలయ్యాయి. దీంతో బాధిత తల్లిదండ్రులకు స్కూల్ సిబ్బంది సమాచారం ఇవ్వగా, హుటాహుటిన సమీప ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్తీసుకుంటున్న చిన్నారిని డీఈఓ రేణుకాదేవి పరామర్శించారు. అనంతరం మున్నూర్ సోమారంలోని పాఠశాలను సందర్శించారు.