వలసొచ్చినోళ్లకు చోటు లేదు : కొండేటి శ్రీధర్‌‌‌‌‌‌‌‌

వర్ధన్నపేట, వెలుగు : వలస వచ్చిన వారికి వర్ధన్నపేట నియోజకవర్గంలో స్థానం లేదని బీజేపీ వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే రమేశ్‌‌‌‌‌‌‌‌ ప్రజాప్రతినిధులను అసభ్యకరంగా తిట్టడం సరికాదన్నారు. సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌ అవుతున్న ఎమ్మెల్యే మాటలు విని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలో కేంద్ర నిధులతో జరిగిన అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 3 వేల ఇండ్లు, కొత్త రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డులు ఇచ్చామని, వర్ధన్నపేట – జఫర్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ రోడ్డును వెడల్పు పనులు చేయించామని గుర్తు చేశారు. వర్ధన్నపేట మండల కేంద్రంలోని కోనారెడ్డి చెరువు పనులు మూడేళ్లు అవుతున్నా పూర్తి కావడం లేదన్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు చీటూరి రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు నాంపల్లి యాకయ్య, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జడ సతీశ్‌‌‌‌‌‌‌‌, పట్టణ మాజీ అధ్యక్షులు కొండేటి సత్యం, మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపెళ్లి కృష్ణమూర్తి పాల్గొన్నారు.