వర్ధన్నపేట (ఐనవోలు ), వెలుగు : సరదా ఆట ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన యువకుడు(27) ట్రాక్టర్మెకానిక్ షెడ్రన్ చేస్తున్నాడు. గురువారం షెడ్లో పని చేసుకుంటుండగా ఇతడికి వరుసకు బావ అయ్యే వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆట పట్టించాలని యువకుడి మలద్వారం దగ్గర హైడాల్రిక్ ఎయిర్ ప్రెషర్ పెట్టి గాలి వదిలాడు.
కొద్దిసేపటికే అతడు అస్వస్థతకు గురికాగా స్థానిక దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి వరంగల్లోని ప్రైవేట్దవాఖానకు తీసుకువెళ్లారు. పెద్ద పేగులో గాలి చేరడంతో డాక్టర్లు ఆపరేషన్ చేశారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం. దీనిపై ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.