
- అధికార, ప్రతిపక్ష సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటా: రాజ్యసభ చైర్మన్ ధంఖర్
ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం.పెద్ద మొత్తంలో నగదు బయటపడిన తర్వాత ఆయనపై సుప్రీంకోర్టు శుక్రవారం (మార్చి 21) అంతర్గత దర్యాప్తు చేపట్టింది. ప్రాథమిక చర్యగా వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నేతృత్వంలో విచారణకు ఆదేశించింది.
సుప్రీంకోర్టు అంతర్గవ విచారణ విధానం ప్రకారం..అంతర్గత ప్యానెల్ నివేదిక ఆధారంగా, తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అయితే పార్లమెంట్ ఆమోదించిన అభిశంసన తీర్మానం ద్వారా మాత్రమే హైకోర్టు న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించవచ్చు. ఇప్పటివరకు భారత దేశ చరిత్రలో ఏ న్యాయమూర్తిపై కూడా అభిశంసన జరగలేదు. అయితే కొందరు విచారణ ఎదుర్కొని పూర్తి కాకముందే రాజీనామా చేశారు.
మరోవై ఢిల్లీ హైకోర్టు సిట్టింగ్ జడ్జి నివాసంలో భారీ నగదు రికవరీపై శుక్రవారం రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. స్పందించిన చైర్మన్ ధంకర్ ఈ అంశంపై నిర్మాణాత్మక చర్చకు ఓ యంత్రాంగాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. సభలో అధికార, ప్రతిపక్ష నేతలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఢిల్లీ హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఇంట్లో నగదు రివకరీ ఆరోపణలపై శుక్రవారం రాజ్యసభ మొదటి సెషన్ లో కాంగ్రెస్ ఎంపీ జై రాం రమేష్ ఈ అంశంపై చైర్మన్ స్పందనను కోరారు. న్యాయపరమైన జవాబుదారీతనంపై అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసనకు సంబంధించిన పెండింగ్ నోటీసు గురించి కూడా గుర్తు చేశారు.
ALSO READ | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ట్విస్ట్..హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై గతంలో 50 మంది పార్లమెంటు సభ్యులు ఛైర్మన్‌కు నోటీసు సమర్పించారని కూడా ఆయన ఎత్తి చూపారు.ఈ అంశంపై పరిశీలించి న్యాయపరమైన జవాబుదారీతనం పెంచే ప్రతిపాదనకు ప్రభుత్వానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని చైర్మన్ ను కోరారు.
ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నగదు రికవరీపై రాజ్యసభ చైర్మన్ దంఖర్ మాట్లాడుతూ ఆ సంఘటన జరిగిన వెంటనే వెలుగులోకి రాకపోవడం తనను ఇబ్బంది పెడుతోందన్నారు. అలాంటి సంఘటన ఓ పొలిటికల్ లీడర్, ఓ అధికారి లేదా బిజినెస్ మ్యాన్ సంబంధించినది అయితే సంబంధిత వ్యక్తి వెంటనే లక్ష్యంగా మారేవాడని ఆయన అన్నారు.
పారదర్శకంగా, జవాబుదారీగా, ప్రభావవంతంగా ఉండే వ్యవస్థాగత నిర్మాణం అవసరమని ఆయన అన్నారు. సభలోని అధికార, ప్రతిపక్ష నేతలతో సంప్రదించి సెషన్ సమయంలో నిర్మాణాత్మక చర్చకు ఓ యంత్రాంగాన్ని రూపొందిస్తామని చైర్మన్ దంఖర్ చెప్పారు.