ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

మెదక్ వెలుగు,​నెట్​వర్క్: జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మెదక్​జిల్లాలోని వేర్వేరు చోట్ల గురువారం ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్కూళ్లు, కాలేజీల స్టూడెంట్లు పాల్గొన్నారు. జోగిపేటలోని తహసీల్దార్ ఆఫీస్​నుంచి క్లాక్ టవర్ మీదుగా గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట రూరల్ మండల పరిషత్ ఆఫీసులో అధికారులు ప్రతిజ్ఞ చేశారు.

శివ్వంపేట మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మెదక్ లోని పోస్టాఫీస్​నుంచి కలెక్టరేట్​వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్ పాల్గొన్నారు. ఓటరు చైతన్య రథాన్ని జెండా ఊపి  ప్రారంభించారు. బీజేపీ ఆధ్వర్యంలో మెదక్​లోని వైస్రాయ్​గార్డెన్స్ లో, సంగారెడ్డిలోనీ వైఎంఆర్​ఫంక్షన్ హాల్ లో ‘నమో నవ యువ సమ్మేళనం’ నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన సంగారెడ్డి జిల్లా జడ్జి కె.ప్రభాకర్ రావు పాల్గొన్నారు. గుమ్మడిదలలో తహసీల్దార్​ గంగాభవాని ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.