వనపర్తి జిల్లాలో భాషా పండితుల  సర్టిఫికెట్​ వెరిఫికేషన్​ 

వనపర్తి జిల్లాలో భాషా పండితుల  సర్టిఫికెట్​ వెరిఫికేషన్​ 

వనపర్తి, వెలుగు:  జిల్లాలో  భాషాపండితులు, పీఈటీల అప్​గ్రెడేషన్​కు  మంగళవారం సర్టిఫికేట్ల వెరిఫికేషన్​  నిర్వహించారు.   జిల్లా కేంద్రంలోని ఎమ్మార్సీ భవన్​లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో 81 మంది తెలుగు పండితులు, 78 మంది హిందీ పండితులు,  ఇద్దరు ఉర్దూ పండితులు, 43 మంది పీఈటీలు  హాజరయ్యారు.  

ఉదయం నుంచి ఎమ్మార్సీ కేంద్రంలో భాషాపండితులు, పీఈటీలతో   నిండింది.  కాగా  జిల్లాలోని ఎస్జీటీ టీచర్లలో బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తిచేసిన వారి సర్టిఫికేట్ల వెరిఫికేషన్​ను  బుధవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి గోవిందరాజు తెలిపారు. వారు కలెక్టరేట్​లోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో  సర్వీస్ బుక్స్​,  సర్టిఫికెట్స్ తో  వెరిఫికేషన్ కు  హాజరు కావాలని తెలిపారు. 

నాగర్​ కర్నూల్​లో  ..

నాగర్ కర్నూల్ టౌన్  : నాగర్ కర్నూలు జిల్లాలో  భాషా పండితులు, పీఈటీల  సర్టిఫికెట్ వెరిఫికేషన్  మంగళవారంతో పూర్తయిందని  డీఈవో ఎం. గోవిందరాజులు తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న 154 తెలుగు పండితులు,129 హిందీ పండితులు, 62 పీఈటీలు, 3 ఉర్దూ ఉపాధ్యాయులు తమ స్కూల్ అసిస్టెంట్   ప్రమోషన్​ కోసం  వెరిఫికేషన్ చేసుకున్నట్లు డీఈఓ తెలిపారు.   ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి కురుమయ్య, రాజశేఖర్ రావు,  సెక్టోరియల్ అధికారులు వెంకటయ్య, షర్ఫుద్దీన్, నూరుద్దీన్, ఎస్జీఎఫ్ కార్యదర్శి పాండు, జీహెచ్ఎం తిరుపతయ్య
 పాల్గొన్నారు.