నిజాయతీని చాటుకున్న కండక్టర్

  •   ప్రయాణికుడు మరిచిపోయిన ల్యాప్ టాప్ అప్పగింత

కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్1 డిపోలో కండక్టర్ గా  విధులు నిర్వహిస్తున్న పి.కనకయ్య తన నిజాయతీని చాటుకున్నాడు. ఆదివారం ఉదయం  సికింద్రాబాద్  జేబీఎస్  నుంచి కరీంనగర్ కు ఆర్టీసీ బస్సులో జర్నీ చేసిన ఓ ప్రయాణికుడు తన ల్యాప్  టాప్  ను బస్సులో మరిచిపోయి దిగి వెళ్లిపోయాడు.  

కండక్టర్  గమనించి ఆ  ల్యాప్ టాప్ ను తీసుకొని 1 డిపో పోలీసులకు అప్పగించాడు. అనంతరం ఆ ప్రయాణికుడు డిపోకు వచ్చి విచారించగా పోలీసులు అతనికి ల్యాప్ టాప్ ను తిరిగి ఇచ్చారు. దాని విలువ రూ.70 వేలని ఆ ప్రయాణికుడు తెలిపాడు. నిజాయతీని చాటుకున్న కండక్టర్  కనకయ్యను ల్యాప్  టాప్ యజమాని, పోలీసులు అభినందించారు.