ప్రస్తుతం అతను చేస్తోంది కండక్టర్ జాబు. కానీ.. చేద్దామనుకుంది మాత్రం కలెక్టర్ కొలువు. అందుకే ఆడ్నే ఆగలేదు. మెల్లెగా డిస్టెన్స్‌లో డిగ్రీ చేశాడు. ఐఏఎస్‌కు ఎట్ల ప్రిపేర్ గావాల్నో యూట్యూబ్‌లో తెలుసుకున్నడు. పోయిన ఏడాది ఎగ్జామ్ రాసిండు. ప్రిలిమ్స్, మెయిన్స్ కొట్టిండు. ఇగ మిగిలింది ఇంటర్వ్యూనే. అదీ సక్సెసయితే అనుకున్న కొలువు గ్యారంటీ. దాని కోసమే గట్టిగ ప్రిపేరయితున్నడు కర్నాటకకు చెందిన 29 ఏళ్ల యంగ్ కండక్టర్.
రెండు పరీక్షల్లో ఫెయిలైనా..
కండక్టర్ ఎన్‌సీ మధుది మాండ్య జిల్లా మలవళ్లి గ్రామం. బెంగళూరులోని కొత్తనూరు 34వ బీఎంటీసీ డిపోలో పని చేస్తున్నాడు. పేద కుటుంబం కావడంతో దూర విద్యలో ఇంటర్ పూర్తి చేసి 19వ ఏటనే కండక్టర్ అయ్యాడు. కానీ జీవితంలో పెద్దగా ఏదైనా సాధించాలనుకున్నాడు. ఐఏఎస్ కావాలని కలగన్నాడు. ఎగ్జామ్ రాయాలంటే డిగ్రీ అర్హత. అందుకే మళ్లీ దూర విద్యలో డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. జాబ్ చేస్తూనే రోజుకు 5 గంటల చొప్పున చదివాడు. పొద్దున్న 4 గంటలకు లేచి పుస్తకం పట్టుకునేవాడు. డ్యూటీకి వెళ్లే వరకు చదివేవాడు. యూట్యూబ్‌లో ప్రిపరేషన్ వీడియోలు చూసి మెలకువలు తెలుసుకున్నాడు. 2014లో కర్నాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్ష రాశాడు. రాలేదు. 2018లో యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష రాశాడు. అదీ రాలేదు. అయినా నిరాశ చెందలేదు. 2019లో మళ్లీ రాశాడు. ప్రిలిమ్స్ వచ్చింది. మెయిన్స్ కన్నడలో రాశాడు. పాసయ్యాడు. మార్చి 25న ఢిల్లీలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. పాసైతే కలెక్టర్ లేదా ఎస్పీ.. ఏదైనా సాధించినట్లే.
ఇంటర్వ్యూ పాసైత
బీఎంటీసీ ఆఫీస్ సీనియర్లు నన్ను ప్రోత్సహించారు. ఎగ్జామ్‌కు కోచింగ్ తీసుకోలేదు. పరీక్షకు సంబంధించి యూట్యూబ్‌లో చాలా వీడియోలు చూశా. మెయిన్స్ జవాబులు ఎలా రాయాలో తెలుసుకున్నా . ఇంటర్వ్యూకూ ఇలాగే చేస్తున్నా. పాసవుతానన్న నమ్మకముంది. – కండక్టర్ మధు
For More News..