అధికారుల వేధింపులతో.. పురుగుల మందు తాగి కండక్టర్ ఆత్మహత్య

అధికారుల వేధింపులతో.. పురుగుల మందు తాగి కండక్టర్ ఆత్మహత్య

యాచారం:రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గాండ్లగూడెంలో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత 15 రోజుల క్రితం ఆర్టీసీ ఉన్నతాధికారులు వేధించడం తో ఇంట్లో పురుగుల మందు తాగి కండక్టర్ అంజయ్య (40) ఆత్మహత్యయత్నం చేసి చికిత్స పొందాడు. 

ఆత్మహత్యాయత్నం చేసిన రోజు నుంచి లీవ్లో ఉండగా 27కి పూర్తయింది. దీంతో నిన్న మరోసారి పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడి చికిత్స పొందుగుతూ మృతి చెందాడు. కండక్టర్ మృతికి అధికారుల ఒత్తిడే కారణమని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.