ఇండియా. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలగలసిన మనుషులే కాదు భిన్నమైన రుచులను ఆస్వాదించే మనుషులకూ కొదవే లేదు. అందుకే ఫుడ్ బిజినెస్ రంగం వైపు అడుగులు వేసి నష్టపోయిన వాళ్ల సంఖ్య చాలా తక్కువ. ఇండియాలోని మెట్రో నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. అయితే.. ఆ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్లో కూడా ఏదైనా కొత్తగా టేస్టీ ఫుడ్తో పబ్లిక్లోకి వెళితేనే నాలుగు రాళ్లు వెనకేసుకునే అవకాశం ఉంటుంది. 2025లో ఫుడ్ బిజినెస్, స్ట్రీట్ ఫుడ్ వైపు పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే మాత్రం ఈ కోన్ పిజ్జా బిజినెస్ ట్రై చేయొచ్చేమో.
సిటీల్లో పిజ్జా బిజినెస్ లాభసాటి వ్యాపారాల్లో ఒకటి. కానీ.. ఈ బిజినెస్లో ఇప్పటికే పిజ్జా హట్, డోమినోస్.. ఇలా పెద్దపెద్ద తలకాయలు దూసుకెళుతున్నాయి. అయినప్పటికీ పిజ్జా బిజినెస్ మొదలుపెట్టడానికి స్కోప్ ఉంది. కాంపిటీషన్ ఉన్న మాట నిజమే గానీ.. ఆ పిజ్జా మేకింగ్లో కొత్తదనంతో ముందుకెళితే బిజినెస్ వర్కౌట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్ట్రీట్ ఫుడ్ బిజినెస్లో ఓ వెలుగు వెలిగే అవకాశం మీకు రావొచ్చు.
అలా మీకు పనికొచ్చే ఒక బిజినెస్ ఐడియానే ఈ కోన్ పిజ్జా (Cone Pizza). ఈ కోన్ పిజ్జా మెషిన్ దగ్గరదగ్గర లక్షన్నరలో మీకు వచ్చేస్తుంది. లేదు.. మిషనరీకే అంత బడ్జెట్ ఇన్వెస్ట్ చేయడానికి మీ దగ్గర లేదనుకున్నా.. మార్కెట్లో 50 వేల నుంచి 80 వేల మధ్యలో దొరికే కోన్ పిజ్జా మెషిన్స్ కూడా ఉన్నాయి. ఒక్కో కోన్ పిజ్జా తయారుచేయడానికి అయ్యే కాస్ట్ 60 రూపాయలు దాటొచ్చు. యావరేజ్గా రోజుకు 100 పిజ్జాలు సేల్ అయినా మంచి లాభాలు పొందొచ్చు. ఒక్కో కోన్ పిజ్జా తయారుచేయడానికి 60 రూపాయలు అయితే ఒక్కో పిజ్జా ఎంతకు అమ్మితే లాభాలొస్తాయంటారా..? ఈ ప్రశ్నకు ఆన్సర్ సింపుల్. మీరు ఎంతకు అమ్మితే మీకు గిట్టుబాటు అవుతుంది..? కాంపిటీటర్లు ఎంతకు అమ్ముతుంటే లాభాలొస్తున్నాయ్..? కస్టమర్లు క్యూ కట్టాలంటే పిజ్జా కాస్ట్ ఎంత ఉండాలి..? ఈ లెక్కలన్నీ అక్కడ మీ ఫుడ్ ఐటంకు ఉన్న డిమాండ్ను బట్టి మీరే డిసైడ్ చేసుకోండి.
ALSO READ | Rupee value: మరింత డీలా పడ్డ రూపాయి.. కారణం ఇదే
ఒకతను ఐటీ జాబ్ మానేసి మరీ 2011లో ఈ బిజినెస్ ట్రై చేశాడు. ఛండీఘర్లో ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేశాడు. ఆ టైంలో డోమినోస్ పిజ్జా మార్కెట్ షేర్ ఇండియాలో 54 శాతానికి పైమాటే. అలాంటి సమయంలో రిస్క్ చేసి అతను ఈ బిజినెస్లోకి దూకాడు. ఈ కోన్ పిజ్జా బిజినెస్ ఐడియా అతనికి వర్కౌట్ అయింది. 2017లో 100 స్టోర్లు, 2022కు ఆ సంఖ్య 500కు పెరిగింది. అతనికి కలిసొచ్చిందని అందరికీ కలిసొస్తుందని కాదు గానీ రిస్క్ చేస్తేనే బిజినెస్లో సక్సెస్ దక్కుతుందనేది మాత్రం నూటికి నూరు పాళ్లు నిజం. తెలుగు రాష్ట్రాల్లో పిజ్జా బిజినెస్లో ప్రయోగాలు చేసే స్కోప్ ఎక్కువగానే ఉంది. అదృష్టా్న్ని పరీక్షించుకోవచ్చేమో. ఫుడ్ బిజినెస్ వైపు చూస్తుంటే మాత్రం ఒక్కసారి ఆలోచన చేయొచ్చనుకుంటా.