బ్లడ్ క్యాన్సర్​పై యశోద హాస్పిటల్స్​లో సదస్సు

బ్లడ్ క్యాన్సర్​పై యశోద హాస్పిటల్స్​లో సదస్సు

హైదరాబాద్, వెలుగు : బ్లడ్​ క్యాన్సర్ ​గురించి చర్చించడానికి యశోదా హాస్పిటల్​ హైదరాబాద్​ హైటెక్​ సిటీ బ్రాంచ్​ “డెక్కన్ హెమటోలింక్ 2.0” పేరుతో సదస్సు నిర్వహించింది.  బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స, పేషెంట్ కేర్‌‌లో వచ్చిన తాజా డెవలప్​మెంట్స్​ గురించి 200 మందికిపైగా జాతీయ, 10 మందికిపైగా అంతర్జాతీయ ఆంకాలజీ, హెమటో- ఆంకాలజీ ఎక్స్​పర్టులు మాట్లాడారు. ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ జి.యస్. రావు ప్రారంభించారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బ్లడ్ క్యాన్సర్ ‌‌‌‌తో పోరాడడం అంటే కేవలం వైద్య చికిత్సకు సంబంధించినది మాత్రమే కాదని, దీనికి మానసిక బలం, ఆర్థిక మద్దతు, సమాజ అవగాహన కూడా అవసరం అన్నారు. భారతదేశంలో బ్లడ్ క్యాన్సర్ల భారం నానాటికి పెరుగుతుందని, ఏటా దాదాపు 1.3 మిలియన్ల కొత్త క్యాన్సర్​  కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. అందులో బ్లడ్​ క్యాన్సర్లు భారీగా ఉంటున్నాయని రావు తెలిపారు.