ముఖ్య అతిథిగా హాజరుకానున్న మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ‘విధ్వంస జీవన విధానం - సాంస్కృతిక చైతన్యం’ పేరిట సదస్సు నిర్వహించనున్నారు.
తెలంగాణ భాషా, సాంస్కృతిక సారథి, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రోగ్రామ్ కు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
ఈ సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం, ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న, లోకకవి అందెశ్రీ, విమల గద్దర్, విమలక్క, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి, ఎక్క యాదగిరి, నర్సింగారావు, ఎంవీ రమణారెడ్డి, చక్రాల రఘు హాజరుకానున్నారు.