యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోనే ఆలేరు ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశీర్వదిస్తే మూడోసారి కూడా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం హైదరాబాద్‌కు వెళ్లి సీఎంను కలిశారు.
అంతకుముందు వైకుంఠ ద్వారం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డితో కలిసి కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మదర్ డెయిరీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి, గుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ హేమేందర్ గౌడ్, రైతుబంధు జిల్లా డైరెక్టర్ మిట్ట వెంకటయ్య, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, జడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, నేతలు మారెడ్డి కొండల్ రెడ్డి, శ్రీనివాస్, నరహరి పాల్గొన్నారు.