భారత్ - ఆఫ్ఘనిస్థాన్ ఫుట్బాల్ మ్యాచ్లో ఇద్దరు ప్లేయర్లు బాక్సింగ్ చేశారు. ఈ బాక్సింగ్కు కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం వేదికైంది. శనివారం భారత్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య AFC ఆసియా కప్ క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 2-0 గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. అయితే ఫైనల్ విజిల్ తర్వాత రెండు జట్ల ఆటగాళ్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. భారత్, ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్ల మధ్య గొడవ మొదలైంది. ఇది చినికి చినికి గాలివానలా మారింది. మొదట నెమ్మదిగా మొదలైన తోపులాట...ఆ తర్వాత కొట్టుకునే స్థాయిని దారి తీసింది. ఇక రెండు జట్లకు సంబంధించిన మిగతా ఆటగాళ్లు గ్రౌండ్లోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఒకరినొకరు తోసుకుంటూ.. కొట్టుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ రిజర్వ్ ఆటగాడు .. భారత గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ సంధు ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. ఇది వీడియోలో స్పష్టంగా రికార్డయింది. దీనిపై అధికారులు విచారణ కూడా చేపట్టారు. అటు భారత ఫ్యాన్స్తోనూ అఫ్ఘాన్ ఫ్యాన్స్ గొడవ పడ్డారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో..కొందరు టీమిండియా ఫ్యాన్స్తో వాగ్వాదానికి దిగారు. భారత్- అఫ్ఘనిస్తాన్ ప్లేయర్ల గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Just look at @GurpreetGK ?
— Roshan stan? (@_R4real_) June 12, 2022
Roshan and akash tried to fight them like brothers
Then there's GSS entering the scene like a brave dad saving his sons. #IndianFootball pic.twitter.com/J88RDeKR01