లిస్టులో తల్లి పేరు.. బీ ఫారంలో భార్య పేరు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ పార్టీ తమ అభ్యర్థిగా మాజీ కార్పొరేటర్ తల్లి పేరును లిస్టులో ప్రకటించింది. అయితే బీ ఫారం ఇచ్చే టైంలో మాత్రం ఆ కార్పొరేటర్ భార్యను తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ గుడిమెట్ల సురేష్ రెడ్డి తల్లి ఆదిలక్ష్మిని అభ్యర్థిగా లిస్టులో చేర్చారు. అయితే సురేష్ రెడ్డి మాత్రం ముందుగా తన తల్లితో పాటు భార్య హేమలతతో కూడా నామినేషన్ వేయించారు. తర్వాత పార్టీ బీ ఫారం ఇచ్చే సమయంలో మాత్రం తన భార్య హేమలత పేరు మీదనే ఇవ్వాలని ఆయన పార్టీ పెద్దలను కోరారు. దాంతో శనివారం రాత్రి డివిజన్‌లో జరిగిన రోడ్ షోలో హేమలతను అభ్యర్థిగా కేటీఆర్ ప్రకటించారు.

For More News..

చేతిలో రూపాయి లేకుండా కార్పొరేటర్ బరిలోకి

ప్రచారానికి పోతే రూ.1000, బిర్యానీ ప్యాకెట్

కరోనా మరణాల కట్టడికి కొత్త ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌కు కనుగొన్న తెలంగాణ సైంటిస్ట్