కన్ఫ్యూజన్ : అరటిపండు ఫ్రిజ్ లో పెట్టొచ్చా..? పెట్టొద్దా..?

కన్ఫ్యూజన్ : అరటిపండు ఫ్రిజ్ లో పెట్టొచ్చా..? పెట్టొద్దా..?

మామూలుగా పండ్లు, కూరగాయలు వాడిపోకుండా, ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఫ్రిజ్ లో స్టోర్ చేస్తుంటాం. అయితే.. చాలాసార్లు మనకు తెలియకుండానే కొన్ని పెట్టకూడని పదార్థాలు కూడా ఫ్రిజ్ లో పెట్టేస్తుంటాం. దీనివల్ల వాటిలోని పోషకాలు పోయి అది ఎందుకు పనికిరాకుండా పోతుంది. అలా ఫ్రిజ్ లో పెట్టకూడని వాటిలో అరటిపండు కూడా ఒకటి అని చాలామంది భావిస్తుంటారు. నిజానికి అరటిపండు ఫ్రిజ్ లో పెట్టకూడదు అనే నియమం ఏం లేదు. 

ఫ్రిజ్లో పెడితే చాలారోజులు ఫ్రెష్గా ఉంటాయి. అరటిపండు మీద వాలే చిన్న చిన్న దోమల బెడద కూడా తప్పుతుంది. అరటి పండు ఫ్రిజ్ లో పెట్టి తింటే అందులోని పోషకాలు విషపూరిత టాక్సిన్లుగా మారిపోతాయని భావించేవారిది కేవలం అపోహనే అంటున్నారు నిపుణులు. ఫ్రిజ్ లో పెట్టినంత మాత్రాన అరటిపండులోని గుణాలు ఏమాత్రం తగ్గవంటున్నారు వారు.